శనివారం 30 మే 2020
International - Apr 15, 2020 , 10:29:56

కరోనాతో అమెరికాలో ఒకేరోజు 2వేల మంది మృతి

కరోనాతో అమెరికాలో ఒకేరోజు 2వేల మంది మృతి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో విలవిలాడుతున్నది. ప్రణాంతక వైరస్‌ వల్ల మంగళవారం ఒక్కరోజే 2,129 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25వేలు దాటింది. దేశంలో గత 24 గంటల్లో ఆరు లక్షలకు పైగా అమెరికన్లకు కరోనా పాజిటివ్‌ పరీక్షలు నిర్వహించారు. అమెరికాలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన న్యూయార్కులో 10,842 మంది మరణించారు. ఇందులో ఒక్కసారి కూడా కరోనా పరీక్షలు చేయించుకోనివారు నాలుగువేల మంది ఉన్నారు. ఈ వైరస్‌ వల్ల మరో 3778 మంది మరణించే అవకాశం ఉన్నదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నగరంలో 2,03,020 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25,981 మంది మరణించారు. logo