గురువారం 02 జూలై 2020
International - Jun 01, 2020 , 06:48:21

అమెరికాలో ఆగని కరోనా ఉద్ధృతి

అమెరికాలో ఆగని కరోనా ఉద్ధృతి

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ఆదివారం ఒక్కరోజే 598 మంది కరోనా వల్ల చనిపోయారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,06,176కు చేరింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 20,345 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18.36లక్షలు దాటింది. 


logo