మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 16:21:00

గంటకు 2,600 కొత్త కరోనా కేసులు

 గంటకు 2,600  కొత్త కరోనా కేసులు

వాషింగ్టన్‌:  కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలం అవుతున్నది.   ఆదేశంలో   కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. అమెరికాలో    కరోనా వైరస్‌ కేసుల  సంఖ్య  40లక్షలను దాటింది.  ప్రతి గంటకు సగటున 2,600 కొత్త కేసులు నమోదవుతున్నాయి.     ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కొత్తకేసుల నమోదు రేటు ఎక్కువగా ఉన్నది. 

జనవరి 21న తొలికేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి  వైరస్‌ వ్యాప్తి  భారీగా పెరిగిపోయింది. పది లక్షల కేసులను  చేరుకోవడానికి 98 రోజులు పట్టింది.  20లక్షలకు చేరుకోవడానికి మరో 43 రోజులు కాగా, 30 లక్షలను అధిగమించడానికి  27రోజులు పట్టింది. నిమిషానికి 43 కొత్తకేసుల చొప్పున 40లక్షలకు చేరుకోవడానికి 16 రోజులు మాత్రమే పట్టింది.  ఈ గణాంకాలను పరిశీలిస్తేనే అర్థమవుతోంది అమెరికాలో కరోనా ఉద్ధృతి ఎంత భయంకరంగా ఉందో. 

అమెరికాలో కరోనా   బారినపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.   గురువారం వరకు అమెరికాలో కరోనా కేసులు 41,01,308 నమోదు కాగా, 146,192 మంది కోవిడ్‌-19 వల్ల చనిపోయారు. 


logo