మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 01, 2020 , 09:32:25

టిక్‌టాక్‌పై అమెరికాలోనూ నిషేధం!

టిక్‌టాక్‌పై అమెరికాలోనూ నిషేధం!

వాషింగ్ట‌న్‌: అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన సోష‌ల్ మీడియా యాప్ టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించనున్న‌ట్లు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. అమెరికా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని చైన్ ఇంటెలిజెన్స్ ఉప‌యోగించుకుంటున్న‌ద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వ‌న్‌లో విలేక‌రుల‌తో ట్రంప్ మాట్లాడారు. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అమెరికా నుంచి దాన్ని బ‌హిష్క‌రిస్తున్నామ‌ని చెప్పారు. 

అమెరికా ప్ర‌జ‌ల స‌మాచార గోప్య‌త‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో టిక్‌టాక్‌పై నిషేధం విధించే అంశాన్ని ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తున్న‌ద‌ని ట్రంప్ గ‌తంలో కూడా ప్ర‌క‌టించారు. 


logo