ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 15:16:19

నేను అధ్యక్షుడిగా గెలిచానో, లేదో కాలమే చెప్తుంది..!

నేను అధ్యక్షుడిగా గెలిచానో, లేదో కాలమే చెప్తుంది..!

వాషింగ్టన్‌ : ఎన్నికల ఫలితాలు పూర్తయిన దాదాపు వారం రోజుల తరువాత డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తొలిసారిగా నోరు తెరాచారు. తన ఓటమిని అంగీకరించే విధంగా మాట్లాడారు. ఇప్పటికే బైడెన్‌ కన్నా చాలా వెనుకబడి ఉన్న ట్రంప్‌.. శనివారం ఉదయం మీడియాతో వేదాంత ధోరణిలో మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా గెలిచానో, లేదో అన్నది కాలమే చెప్తుందన్నారు. ఓటింగ్, లెక్కింపులో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తూ ట్రంప్, అతని ప్రచార బృందం అనేక కేసులు దాఖలు చేసినందున ఈ ప్రకటన ప్రాముఖ్యత సంచరించుకున్నది. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగుతారని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా సోమవారం వెల్లడించారు. అయితే, తొలిసారిగా ట్రంప్ ఈ విషయంపై చాలా సరళమైన విధానాన్ని తీసుకుని తన గెలుపోటములను కాలంపై వేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటమిని అంగీకరించి సంప్రదాయాన్ని అనుసరిస్తానని సూచించే ప్రకటనేదీ ట్రంప్‌ ఇంతవరకు చేయలేదు. 

మీడియాతో సంభాషణల్ో కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. యూరోపియన్ దేశాలు, బ్రిటన్‌లో పెరిగిన ఇన్ఫెక్షన్ ఉండటంతో అక్కడ కఠినమైన లాక్‌డౌన్ విధించారు. కానీ, అమెరికాలో లాక్‌డౌన్‌ విధించలేదని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధాంచాల్సిన అవసరం లేదని, మరికొన్ని వారాల్లో వచ్చే వ్యాక్సిన్ కోసం అన్ని సన్నాహాలు జరిగాయని చెప్పారు. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఆశించానని, అయితే, తరువాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. ఏ పరిపాలన ఉంటుంది? అన్న మీడియా ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం ఇస్తుందని అనుకుంటున్నానని చెప్పారు. 

డొనాల్డ్‌ ట్రంప్‌కు ఎక్కువ సమయం లేదు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఎలక్టోరల్ కాలేజీకి ముందు ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది. తాజాగా వెల్లడించిన ఫలితాల మేరకు జో బైడెన్ ఇప్పుడు 290 ఓట్ల మార్కును చేరుకున్నారు. అరిజోనా, జార్జియాలు కూడా బైడెన్‌ ఖాతాలో పడ్డాయి. ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల సమావేశాలు డిసెంబర్ 8 న, 14 న ఓటింగ్ జరగనున్నది. దీనికి ముందు చట్టపరమైన విషయాలను పరిష్కరించుకోవాలి. ఈ విజయాన్ని బైడెన్‌ను అభినందించడం ద్వారా ట్రంప్ త్వరలోనే వైట్ హౌస్ నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతారని రాజకీయ నిపుణులు నమ్ముతున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.