e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News అమెరికా అధ్య‌క్షుడి ఆత్మీయ శున‌కం మృతి

అమెరికా అధ్య‌క్షుడి ఆత్మీయ శున‌కం మృతి

అమెరికా అధ్య‌క్షుడి ఆత్మీయ శున‌కం మృతి

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కుటుంబానికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్ శున‌కం ఛాంప్ (13) మృతిచెందింది. వ‌యోభారం కార‌ణంగానే శున‌కం మ‌ర‌ణించిన‌ట్లు బైడెన్ ఫ్యామిలీ వెల్ల‌డించింది. 2008లో అమెరికా ఉపాధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో బైడెన్‌ ఓ జంతువుల వ్యాపారి నుంచి చిన్న కూన‌గా ఉన్న ఆ శున‌కాన్ని కొనుగోలు చేశారు. అప్ప‌టి నుంచి అది బైడెన్ కుటుంబంలో ఓ భాగంగా మారిపోయింది.

తాము దుఃఖంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా గ‌త 13 ఏండ్లుగా ఛాంప్ త‌మ‌ వెంటే ఉన్న‌ద‌ని బైడెన్ దంప‌తులు ఆ శున‌కం తాలూకూ జ్ఞాప‌కాల‌ను గుర్తుచేసుకున్నారు. ఈ మేర‌కు శ‌నివారం వారు ఒక ట్వీట్ చేశారు. డెలావ‌ర్‌లోని బైడెన్ స్వ‌గృహంతోపాటు శ్వేత సౌధంలోనూ ఛాంప్‌కు ప్ర‌త్యేక స్థానం ఉండేది. కాగా, ఛాంప్ మృతితో బైడెన్ ఇంట ఉండే మ‌రో శున‌కం మేజ‌ర్ ఒంట‌రిది అయ్యింది. బైడెన్ ప్ర‌తిరోజు వాకింగ్‌కు వెళ్లే స‌మ‌యంలో ఆ రెండు శున‌కాల‌ను వెంట తీసుకెళ్లేవాడ‌ట‌.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమెరికా అధ్య‌క్షుడి ఆత్మీయ శున‌కం మృతి
అమెరికా అధ్య‌క్షుడి ఆత్మీయ శున‌కం మృతి
అమెరికా అధ్య‌క్షుడి ఆత్మీయ శున‌కం మృతి

ట్రెండింగ్‌

Advertisement