ఆదివారం 17 జనవరి 2021
International - Dec 22, 2020 , 06:19:44

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అమెరికా ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అమెరికా ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా హాస్పిటల్‌లో 78 ఏళ్ల బైడెన్‌కు ఫైజర్‌ టీకా ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమెరికా చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. అమెరికన్లలో కరోనా టీకా పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు బైడైన్‌ పేర్కొన్నారు. టీకా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి అమెరికాలో టీకా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ ఉన్న భయాందోళలను తొలగించేందుకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ ముందుకు వచ్చారు. తాను టీకాను బహిరంగంగా తీసుకుంటానని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆయన సోమవారం వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 17.5 మిలియన్లకుపైగా జనం మహమ్మారి బారినపడ్డారు. 3.15లక్షల మంది మృత్యువాతపడ్డారు.