శనివారం 08 ఆగస్టు 2020
International - Jul 10, 2020 , 07:41:57

అమెరికాలో ఒకేరోజు 65 వేల మందికి కరోనా

అమెరికాలో ఒకేరోజు 65 వేల మందికి కరోనా

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చింది. దేశంలో నిన్న రికార్డు స్థాయిలో 65,551 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకు మొత్తం 3,21,19,999 మంది కరోనాబారిన పడ్డారు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 16,57,749 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 14,26,428 మంది కోలుకున్నారు. గురువారం కొత్తగా 960 మంది కరోనా బాధితులు మరణించడంతో ఈ వైరస్‌తో మృతుల సంఖ్య 1,35,822కు చేరింది. అమెరికాలో ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. దేశంలో బుధవారం 60,200 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు.  

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,23,78,854  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,56,601 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే కొత్తగా 2,22,825 కరోనా కేసులు రికార్డయ్యాయి.


logo