బుధవారం 28 అక్టోబర్ 2020
International - Sep 20, 2020 , 07:47:41

అమెరికాలో మ‌రో వారంతర్వా‌తే టిక్‌టాక్‌పై‌ బ్యాన్

అమెరికాలో మ‌రో వారంతర్వా‌తే టిక్‌టాక్‌పై‌ బ్యాన్

న్యూయార్క్‌: బ‌హుళ జ‌నాధర‌ణ పొందిన వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధాన్ని అమెరికా ప్ర‌భుత్వం వాయిదావేసింది. అగ్ర‌రాజ్యంలో టిక్‌టాక్‌ను మ‌రో వారంపాటు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 27న నిషేధం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని యూఎస్ వాణిజ్య విభాగం ప్రకటించింది. గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగా టిక్‌టాక్‌పై ఈరోజు నుంచి నిషేధం అమ‌ల్లోకి రావాల్సి ఉన్న‌ది.  

అమెరికాలో టిక్‌టాక్ కార్య‌క‌లాపాల కోనుగోళుకు సంబంధించిన ఇటీవ‌ల సానుకూల ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. యూఎస్ కార్యకలాపాల నిర్వహణలో ఒరాకిల్, వాల్‌మార్ట్‌ను భాగస్వాములుగా చేర్చుకుంటున్న‌ట్లు చైనా యాజమాన్యంలోని టిక్‌టాక్ దృవీక‌రించింది. 


logo