ఆదివారం 29 మార్చి 2020
International - Mar 27, 2020 , 07:05:34

క‌రోనా పాజిటివ్‌.. చైనాను దాటేసిన అమెరికా

క‌రోనా పాజిటివ్‌.. చైనాను దాటేసిన అమెరికా

హైద‌రాబాద్: క‌రోనా వైర‌స్ అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తున్న‌ది. క‌రోనా పాజిటివ్ కేసుల్లో చైనాను అమెరికా దాటేసింది. అమెరికాలో 83,500 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  చైనాలో 81,782 మందికి, ఇట‌లీలో 80 వేల 589 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ లెక్క‌లు వెల్ల‌డించింది. కానీ అమెరికాలో వైర‌స్ వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య త‌క్కువే ఉన్న‌ది. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల 3291 మంది, ఇట‌లీలో 8215 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ నియంత్ర‌ణ విష‌యంలో ట్రంప్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  త్వ‌ర‌గానే దేశం మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంద‌ని ట్రంప్ అన్న మాటల్లో వాస్త‌వం లేద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

అన్ని రాష్ట్రాల్లో క‌రోనా పరీక్ష‌లు జ‌రుగుతున్న‌ట్లు ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ తెలిపారు.  దేశ‌వ్యాప్తంగా 552000 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పారు. ఏప్రిల్ 12వ తేదీన‌, ఈస్ట‌ర్ సంద‌ర్భంగా అన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌నుకున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అయితే వైర‌స్ విస్తృతంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఆ ప్లాన్  బెదిసికొట్టేలా ఉన్న‌ది. నిరుద్యోగుల‌మంటూ చాలా మంది అమెరిక‌న్లు రికార్డులు ఫైల్ చేస్తున్నారు. 33 ల‌క్ష‌ల మంది నిరుద్యోగ భృతి కావాలంటూ ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల‌కు సామాజిక దూరంపై సూచ‌న‌లు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. 


logo