శనివారం 04 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 02:20:34

ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిన విమానం

ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిన విమానం
  • తామే కూల్చివేశామన్న తాలిబాన్లు..
  • కూల్చిన ఆనవాళ్లులేవన్న అమెరికా
  • ధ్రువీకరించని అగ్రరాజ్యం

ఘజ్ని: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఘజ్ని ప్రావిన్సులో సోమవారం అమెరికా మిలిటరీ విమానం కూలిపోయింది. ఈ విమానాన్ని తామే కూల్చామని తాలిబాన్లు వాదిస్తుండగా.. అలాంటిదేమీ లేదని అమెరికా చెప్తున్నది. విమానంలో ఎంతమంది ఉన్నారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  ఘజ్ని ప్రావిన్సులోని చాలావరకు గ్రామీ ణ ప్రాంతాలు తాలిబన్ల ఆధీనంలో ఉన్నాయి. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు జరుపడం అధికారులకు క్లిష్టతరంగా మారింది. అంతకుముందు ఘజ్ని ప్రావిన్సు లో అమెరికా విమానాన్ని కూల్చేశామని, అందులో ఉన్నవారంతా మృతిచెందారని తాలిబన్‌ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. దీనిపై సోమవారం రాత్రి అమెరికా స్పందించింది. కూలిపోయిన విమానం తమదేనని ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా దళాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్‌ పేర్కొన్నారు. అయితే ఎవరూ కూల్చలేదని స్పష్టం చేశారు. తాలిబాన్ల వాదన నిరాధా రమని కొట్టిపారేశారు. కూలిపో యింది బాంబ్‌రైడర్‌ ఈ-11ఏ విమానమని, దీనిని ఈ ప్రాంతం లో సమాచార ప్రసారానికి వినియోగిస్తున్నామని చెప్పారు. విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని  వెల్లడించారు. logo