గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 14, 2020 , 15:40:13

తాలిబాన్‌ లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు

తాలిబాన్‌ లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు

కాందహార్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ హెల్మాండ్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ స్థావరాలపై అమెరికా మిలటరీ వైమానిక దాడులకు దిగింది. తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఫైటర్లు గర్జించాయి. అమెరికాకు చెందిన ఒక ప్రతినిధి ఒకరు ఈ సమాచారాన్ని వెల్లడిస్తూ.. ఫిబ్రవరిలో అమెరికా-తాలిబాన్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. తాలిబాన్ వెంటనే దూకుడు వైఖరిని నిలిపి, దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస సంఘటనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని అమెరికా మిలటరీ హెచ్చరిస్తూ వస్తున్నది. 

హెల్మాండ్ రాజధాని లష్కర్‌గాలో కాల్పుల సంఘటనల నేపథ్యంలో అమెరికా వైమానిక దాడులు జరిగాయి. గత వారంలో తాలిబాన్ యోధులు అనేక దాడులు చేశారని, వారు వారాంతం వరకు ఊపందుకున్నారని అమెరికా వైమానిక దళానికి చెందిన ప్రతినిధి తెలిపారు. ప్రధాన రహదారిపై చాలా వంతెనలు ధ్వంసమైనందున ప్రస్తుతం హైవేను మూసివేశారు. ఖతార్‌ రాజధాని దోహాలో గత నెలలో తమ రాజకీయ కార్యాలయంలో ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధులతో తాలిబాన్ ప్రతినిధులు చర్చలు ప్రారంభించారు. ఫిబ్రవరిలో తాలిబాన్లతో దళాలను ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి గత రెండు రోజులుగా వారు దాడులు జరిపారు. ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క అరుదైన సైనిక జోక్యాన్ని సూచిస్తుంది.

తిరుగుబాటుదారుల బృందం నుంచి భద్రతా హామీలకు బదులుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విదేశీ శక్తులను ఉపసంహరించుకోవటానికి, దశాబ్దాల యుద్ధానికి శాంతియుత పరిష్కారం కోసం కాబూల్ ప్రభుత్వంతో చర్చలకు కూర్చునేందుకు ఈ ఒప్పందం సహకరిస్తుంది. గత రెండు రోజుల్లో వందలాది తాలిబాన్ యోధులు హెల్మాండ్‌లోని భద్రతా తనిఖీ కేంద్రాలపైకి చొరబడి.. ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గహ్ శివార్లలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా వైమానిక దాడులు "యునైటెడ్ స్టేట్స్-తాలిబాన్ ఒప్పందానికి అనుగుణంగా ఉన్నాయి" అని యూఎస్ సైనిక ప్రతినిధి కల్నల్ సోనీ లెగెట్ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ బృందం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను కొన్ని నెలల ముందు వారి నియంత్రణ నుంచి స్వాధీనం చేసుకున్నారని, "కొత్త మార్పులేవీ జరగలేదు" అని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.