శనివారం 06 జూన్ 2020
International - Apr 09, 2020 , 21:15:29

భార్య‌కు మ‌ద్ధ‌తుగా హాస్పిట‌ల్ బ‌య‌టే

భార్య‌కు మ‌ద్ధ‌తుగా హాస్పిట‌ల్ బ‌య‌టే

క‌రోనా వైర‌స్‌.. ఇంకా ఎంత‌మందిని ఎన్ని విధాలుగా బాధ‌పెడుతుందో. ఆరోగ్యంగా ఉన్నా ప్రేమ‌తో ద‌గ్గ‌ర‌కు తీసుకోలేని ప‌రిస్థితి. ఇటీవల ఆల్బర్ట్ కానర్, అతని భార్య కెల్లీ కానర్ కథ మ‌రింత బాధాక‌రం. వీరి క‌థ అంద‌రినీ క‌న్నీళ్లు పెట్టిస్తున్న‌ది. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న కెల్లీకి వైద్యులు కీమోథెర‌పీ ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఆత్మీయులు ద‌గ్గ‌ర‌గా ఉంటే కాస్తూ కూస్తూ ధైర్యంగా ఉంటుంది. ఏం చేస్తాం. ఈ మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా బంధువుల‌ను ఎవ‌రినీ కెల్లీని చూసేందుకు అనుమ‌తించ‌లేదు.

టెక్సాస్‌లోని ఎండి అండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో కెల్లీతోపాటు ఆల్బ‌ర్ట్ కెమోథెరపీ సెషన్‌కు వెళ్ళలేకపోయాడు. 'నేను నీతో ఉండ‌పోవ‌చ్చు. కానీ ఇక్క‌డే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. నా భార్య‌కు వైద్యం అందిస్తున్న సిబ్బందికి నా ధ‌న్య‌వాదాలు అని త‌న‌లోని బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు. కీమోథెరపీ చేయించుకుంటున్న భార్యకు మద్దతుగా భర్త ఆసుపత్రి వెలుపల ప్లకార్డుతో కూర్చున్న చిత్రం నెట్టింట్లో వైరల్ అయ్యింది.


logo