సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 07, 2020 , 10:01:56

చైనా యాప్‌ల‌పై అమెరికా నిషేధం !

చైనా యాప్‌ల‌పై అమెరికా నిషేధం !

హైద‌రాబాద్‌: చైనాకు చెందిన 59 సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను భార‌త్ నిషేధించిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో అమెరికా కూడా డ్రాగ‌న్ దేశ యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని భావిస్తున్న‌ది.  చైనా యాప్‌ల‌ను నిషేధించాల‌ని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో తెలిపారు.  టిక్‌టాక్‌తో స‌హా అన్ని ర‌కాల యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు.   

మ‌రోవైపు టిక్‌టాక్ యాప్  త‌న ఆప‌రేష‌న్స్‌ను హాంగ్‌కాంగ్‌లో ఆపేసింది.  ఇటీవ‌లో హాంగ్‌కాంగ్‌పై భ‌ద్ర‌తా చ‌ట్టం త‌యారు చేసిన చైనా అక్క‌డ‌ అనేక ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న‌ది. అయితే హాంగ్‌కాంగ్‌లో త‌మ యాప్ ఆప‌రేష‌న్స్‌ను నిలిపివేస్తున్న‌ట్లు టిక్‌టాక్ తెలిపింది. 


logo