సోమవారం 25 జనవరి 2021
International - Jan 07, 2021 , 11:12:17

క్యాపిట‌ల్ హిల్‌పై దాడి.. అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్‌లోకి ప్ర‌జాప్ర‌తినిధులు

క్యాపిట‌ల్ హిల్‌పై దాడి.. అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్‌లోకి ప్ర‌జాప్ర‌తినిధులు

వాషింగ్ట‌న్: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అభిమానులు .. క్యాపిట‌ల్ హిల్ భ‌వనంలో పెను విధ్వంసం సృష్టించారు. బైడెన్ ఎన్నిక ప్ర‌క్రియ కోసం జ‌రుగుతున్న ఉభ‌య‌స‌భ‌ల స‌మావేశాల‌ను అడ్డుకున్న నిర‌స‌న‌కారులు.. ఆ భ‌వ‌నంలో భారీ హింస‌కు తెగించారు.  ప్ర‌జాప్ర‌తినిధులు స‌భ‌లో చ‌ర్చ‌లు చేప‌డుతున్న స‌మ‌యంలో వేలాది సంఖ్య‌లో ట్రంప్ మ‌ద్ద‌తుదారులు క్యాపిట‌ల్ హిల్‌లోకి దూసుకువెళ్లారు.  అయితే ఆ స‌మ‌యంలో ప్రాణ‌భ‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు.. క్యాపిట‌ల్ హిల్‌లో ఉన్న అండ‌ర్ గ్రౌండ్ బంక‌ర్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈస్ట్ ఫ్రంట్ గేటు నుంచి దూసుకువ‌చ్చిన ట్రంప్ అభిమానులు.. అమెరికా, ట్రంప్ జెండాల‌తో తీవ్ర అల‌జ‌డి సృష్టించారు.  హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్ చాంబ‌ర్‌లో సెక్యూర్టీ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. లైన్ దాటి నిర‌స‌న‌కారులు భ‌వ‌నంలోకి దూసుకువ‌చ్చిన‌ట్లు హౌజ్ స‌ర్జెంట్ గ‌ట్టి అర‌వ‌డంతో అక్క‌డ ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోయారు. 

క్యాపిట‌ల్ హిల్ సెంట్ర‌ల్ డోమ్‌లో హౌజ్‌, సేనేట్‌ను క‌లిపే మెట్ల‌ వ‌ద్ద ట్రంప్ మ‌ద్ద‌తుదారులు వీరంగం సృష్టించారు. హాల్‌లో ఉన్న ఆఫీస‌ర్లు అంతా సెక్యూర్టీ రూమ్‌లోకి వెళ్లాలంటూ ఆదేశించారు.  ట్రంప్ అభిమానులు దూసుకురావ‌డంతో.. ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అన్ని డోర్ల‌ను లాక్ చేశారు. హౌజ్ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ మాత్రం ప్ర‌తి స‌భ్యుడిని శాంతింప చేసే ప్ర‌య‌త్నం చేశారు. క్యాపిట‌ల్ హిల్‌లోని రొటుండా ప్రాంతంలో గ్యాస్ లీక్ కావ‌డంతో.. స‌భ్యులంతా గ్యాస్ మాస్క్‌లు తీసుకున్నారు. స‌భ‌లో ఉన్న డెమోక్ర‌ట్లు.. రిప‌బ్లిక‌న్ల‌ను వేడుకున్నారు. మీ ఫ్రెండ్‌ను ట్రంప్‌కు ఫోన్ చేయండి.. ఈ అరాచ‌కాన్ని ఆపండి అంటూ అభ్య‌ర్థించారు. ఉభ‌య‌స‌భ‌ల వేళ అధ్య‌క్షుడు న‌డిచివ‌చ్చే ప్ర‌ధాన ద్వారాన్ని మూసివేశారు. పేలుళ్ల‌కు డోర్ల‌కు ఉన్న గ్లాస్ అద్దాలు ప‌గిలిపోయాయి.  డోర్ల వైపు గ‌న్ల‌ను పాయింట్ చేస్తూ క్యాపిట‌ల్ పోలీసు ఆఫీస‌ర్లు ప్ర‌జాప్ర‌తినిధుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేశారు.  ఆ స‌మ‌యంలో కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు పైవైపు మెట్లు ఎక్కుతూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. కొంద‌రు మాత్రం కింద మెట్ల వైపు నుంచి అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్‌కు వెళ్లారు. 


logo