సోమవారం 01 జూన్ 2020
International - May 10, 2020 , 00:38:52

హెచ్‌1బీపై తాత్కాలిక నిషేధం!

హెచ్‌1బీపై తాత్కాలిక నిషేధం!

  • ట్రంప్‌ సర్కారు యోచన
  • పార్ట్‌టైం జాబ్‌కు వీలు కల్పించే విద్యార్థి వీసాలపైనా కన్ను

వాషింగ్టన్‌, మే 9: కరోనా సంక్షోభం కారణంగా అమెరికాలో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వలస విధానంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. హెచ్‌1బీ వంటి పని ఆధారిత వీసాలు, పనిచేసుకునేందుకు వీలు కల్పించే విద్యార్థి వీసాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' వెల్లడించింది. వచ్చే నెలలోనే దీనిపై ఆదేశాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇదే జరిగితే భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. హెచ్‌1బీ వీసాపై అమెరికాలో దాదాపు 5 లక్షల మంది విదేశీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా కారణంగా అమెరికాలో దాదాపు 3.3 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో హెచ్‌1బీ, హెచ్‌2బీ వంటి పని ఆధారిత వీసాలపై తాత్కాలికంగా నిషేధం విధించి, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 


logo