బుధవారం 03 జూన్ 2020
International - May 08, 2020 , 09:51:22

వాషింగ్ట‌న్‌లో ఓ వీధికి చైనా డాక్ట‌ర్ పేరు..

వాషింగ్ట‌న్‌లో ఓ వీధికి చైనా డాక్ట‌ర్ పేరు..

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు.. ఓ వీధికి చైనా డాక్ట‌ర్ పేరు పెట్టాల‌ని ప్ర‌తిపాద‌న చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని చైనా ఎంబ‌సీ ముందు ఉన్న‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేస్ అన్న వీధికి డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్ పేరు పెట్టాల‌ని ప్ర‌తిపాదించారు.  వుహాన్‌కు చెందిన ఆ డాక్ట‌రే.. ప్ర‌పంచ‌దేశాల‌కు క‌రోనా వైర‌స్ గురించి తొలిసారి వెల్ల‌డించాడు. గ‌త డిసెంబ‌ర్‌లో డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్ త‌న తోటి స‌హ‌చ‌రుల‌కు కొత్త క‌రోనా వైర‌స్ గురించి వీచాట్‌లో షేర్ చేశాడు. సార్స్ లాంటి వైర‌స్ ఏదో ప్ర‌బ‌లుతున్న‌ట్లు అత‌ను అనుమానాలు వ్య‌క్తం చేశాడు. 

వాస్త‌వానికి అప్ప‌టికే చైనా ఈ వైర‌స్ గురించి విచార‌ణ మొదలుపెట్టింది. కానీ ఆ డాక్ట‌ర్ని పోలీసులు త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేశారు. అత‌ను కొన్ని రోజులు వైర‌స్ చికిత్స పొందిన త‌ర్వాత మ‌ర‌ణించాడు. డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్ మృతితో చైనావ్యాప్తంగా ప్ర‌జా ఆగ్ర‌హం వెల్లువెత్తింది. అయితే ప్ర‌స్తుతం ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లేస్ వీధికి డాక్ట‌ర్ పేరును అధికారికంగా ఖరారు చేయ‌డం క‌ష్ట‌మే అయినా.. అమెరికా చేప‌డుతున్న ఈ చ‌ర్య మాత్రం చైనాకు ఆగ్ర‌హం తెప్పిస్తున్న‌ది. 2014లోనూ ఓసారి చైనా నోబెల్ విజేత పేరును ఈ వీధికి పెట్టాల‌నుకున్న‌ది. కానీ అప్పుడు ఆ ప్ర‌య‌త్నంలో స‌ఫ‌లం కాలేదు.logo