గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 02:04:15

హెచ్‌-1బీ వీసాల రద్దు చెల్లదు అమెరికా కోర్టు

హెచ్‌-1బీ వీసాల రద్దు చెల్లదు అమెరికా కోర్టు

వాషింగ్టన్‌: భారత ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హెచ్‌1బీ తదితర వీసాలపై డిసెంబరుదాకా నిషేధం విధిస్తూ జూన్‌లో ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులను నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా కోర్టు కొట్టేసింది. ట్రంప్‌ చర్యలు రాజ్యాంగ అధికార పరిధిని మించిపోయాయని ఫెడరల్‌ జడ్జి జెఫ్రీ వైట్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వీసాలపై నిషేధం ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు 25 పేజీల తీర్పు ఇచ్చారు. ‘ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని నిర్ణయించే అధికారం దేశ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌కు (అమెరికా చట్టసభలకు) మాత్రమే ఉంది. అధ్యక్షుడికి ఆ అధికారం లేదు’ అని స్పష్టంచేశారు. ఈ తీర్పుతో భారత్‌కు చెందిన వేలాది మంది ఐటీ ఉద్యోగులకు మేలు కలుగనుంది. 


logo