శనివారం 16 జనవరి 2021
International - Dec 17, 2020 , 23:24:13

8.85 లక్షలకు పెరిగిన అమెరికా నిరుద్యోగం

8.85 లక్షలకు పెరిగిన అమెరికా నిరుద్యోగం

వాషింగ్టన్‌: అమెరికాలో నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గత మూడు నెలల్లో అనూహ్యంగా పెరిగిపోయింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈ నెల 12 నాటికి 23వేల నుంచి 8.85 లక్షలకు పెరిగిపోయిందని అమెరికా కార్మికశాఖ డేటా పేర్కొంది. 

దీనికి కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుండటంతోపాటు వ్యాపారాల నిర్వహణపై ఆంక్షలు కొనసాగించడం కారణమని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే, సమాఖ్య మహమ్మారి నిరుద్యోగిత సహాయ కార్యక్రమాల కింద సాయం పొందుతున్న వారి లక్షల మంది పేర్లను ఈ జాబితాలో చేర్చడం లేదని తెలుస్తున్నది. 

ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభల ప్రతినిధులు నూతన రిలీఫ్‌ ప్యాకేజీ విధి విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణంపై గణనీయ పురోగతి సాధించే వరకు భారీగా బాండ్ల కొనుగోళ్లు కొనసాగుతాయని అమెరికా ఫెడ్‌ రిజర్వు బుధవారం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.