సోమవారం 06 జూలై 2020
International - Jun 10, 2020 , 16:17:23

రష్యా బాంబర్స్‌ను అడ్డుకున్న అమెరికా జెట్స్‌

రష్యా బాంబర్స్‌ను అడ్డుకున్న అమెరికా జెట్స్‌

వాషింగ్టన్‌: అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న నాలుగు రష్యా బాంబర్స్‌ యుద్ధ విమానాలను అమెరికాకు చెందిన జెట్ ఫైటర్స్‌ అలస్కా వద్ద అడ్డుకున్నాయి. ఆర్‌ఐఏ న్యూస్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని బుధవారం పేర్కొంది. అయితే అంతర్జాతీయ చట్టాలను అనుసరించే తమ తుపోలెవ్‌ తు 95ఎంఎస్‌ బాంబర్లు సముద్ర తలంపై 11 గంటలపాటు ప్రయాణించాయని రష్యా పేర్కొంది. కాగా అమెరికాకు చెందిన ఎఫ్ 22 రాప్టర్ వ్యూహాత్మక యుద్ధ విమానాలు వాటిని కొంతసేపు అనుసరించినట్లు వెల్లడించింది. logo