శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 18:18:35

జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడే కాదు.. అమెరికా కొత్త వాదన

జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడే కాదు.. అమెరికా కొత్త వాదన

వాషింగ్టన్ : జిన్‌పింగ్‌పై కఠినమైన చర్యలకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. జిన్‌పింగ్‌ను మానసికంగా ఇబ్బందిపెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. అసలు జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షుడిగా భావించకూడని, అధికారికంగా కూడా పిలువకూడదని అమెరికా నిర్ణయించింది.  ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలు ఆయనను ఎన్నుకోనందున జిన్‌పింగ్‌ ఏవిధంగానూ చైనా అధ్యక్షుడు కాదని అమెరికా వాదిస్తున్నది. అంతటితో ఆగకుండా జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. 

డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన సభ్యుడు స్కాట్ ప్యారీ ఈ బిల్లును తీసుకువచ్చారు. 'అనిమే యాక్ట్' అని బిల్లుకు పేరు పెట్టారు. జిన్‌పింగ్‌కు లేదా ఏదైనా చైనా పాలకుడిని యూఎస్ ప్రభుత్వ పత్రాలలో అధ్యక్షుడిగా పిలవకూడదని, వ్రాయకూడదని ప్యారీ కోరారు. బిల్లు ప్రకారం.. చైనాలో అధ్యక్ష పదవి లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమే అక్కడ ఉన్నారు. మనం ఆయనను ప్రెసిడెంట్ అని పిలిచినప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినట్లు అనిపిస్తుంది. చైనాలో ప్రజాస్వామ్యం లేదు అని బిల్లులో స్పష్టం చేశారు.

సాంకేతికంగా, బిల్లులో పేర్కొన్న ప్రతీ విషయం సరైనదే. వాస్తవానికి, 1980 కి ముందు ఏ చైనా ప్రభుత్వ అధిపతిని ప్రెసిడెంట్ అని పిలువలేదు. అలాగే, చైనా రాజ్యాంగంలో 'ప్రెసిడెంట్' అనే పదం లేదు. జిన్‌పింగ్‌ను 'ప్రెసిడెంట్' అని పిలవడంపై గందరగోళం ఉంది. అందుకే వివాదాలు ఉన్నాయి. చైనా కలిగి ఉన్న అన్ని పదవులలో ఎవరికీ ప్రెసిడెంట్ అనే టైటిల్ కలిగిలేరు. చైనీస్ భాషలో (మాండరిన్) ఈ పదం గురించి ప్రస్తావించలేదు. 1980 లో చైనా ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైనప్పుడు చైనా పాలకుడు ఆంగ్లంలో అధ్యక్షుడిగా పిలువబడ్డాడు. అయితే, సాంకేతికంగా జిన్‌పింగ్ సీసీపీ చీఫ్ కాబట్టి ఆయనే దేశానికి ప్రధాన పాలకుడు. అయితే, ఆయన రాష్ట్రపతి కాదు. 

సీసీపీ అధిపతి కావడం వల్లేనా..?

జిన్‌పింగ్ 2012 లో అధ్యక్షుడయ్యాడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) అధిపతి కావడం వల్ల ఆయనకు అధ్యక్ష పదవి వచ్చింది. రాజ్యాంగబద్ధంగా సీసీపీ చైర్మన్ ప్రభుత్వానికి, సైన్యానికి అధిపతి. కానీ, జిన్‌పింగ్ విషయంలో ఇది కాదు. ఆయన పార్టీ చీఫ్ గా ఉండటంతోపాటు అన్ని సూపర్ కమిటీలకు చైర్మన్ కూడా వ్యవహరిస్తుందున ఆయనను చైర్మన్ గా పిలువొచ్చని అంతర్జాతీయ నిపుణులు వాదిస్తున్నారు. చైనాలో ప్రజాస్వామ్యం లేదు. ఓటు హక్కు లేదు. మాట్లాడే స్వేచ్ఛ లేదు. జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా పిలవడం అంటే అతడి నియంతృత్వాన్ని గుర్తించడమే అని 2019 లో యూఎస్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ తన నివేదికలో వెల్లడించడం విశేషం.

అన్నీ జిన్‌పింగ్ మయమే

చైనాలో మూడు ముఖ్యమైన పదవులు ఉన్నాయి. రాష్ట్ర చైర్మన్ (గుజియా జుక్షి).. దేశానికి ప్రధాన పాలకులు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ (జోగ్యాంగ్ జున్వీ జుక్షి).. అన్ని రకాల చైనా సైన్యాలకు కమాండర్ ఇన్ చీఫ్. మూడవ పదవి.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా సీసీపీ (జోంగ్ షుజీ). 1954 చైనా రాజ్యాంగం ప్రకారం.. ఆంగ్లంలో చైనా పాలకుడిని చైర్మన్ అని పిలుస్తారు.


logo