గురువారం 28 మే 2020
International - Apr 30, 2020 , 12:20:15

కిమ్‌ను చూడ‌క చాన్నాళ్ల‌వుతున్న‌ది : అమెరికా

కిమ్‌ను చూడ‌క చాన్నాళ్ల‌వుతున్న‌ది : అమెరికా

హైద‌రాబాద్‌: ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ గురించి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో కొన్ని కామెంట్స్ చేశారు. ఈ మ‌ధ్య కాలంలో కిమ్‌ను చూడ‌లేద‌న్నారు.  బ‌హుశా ఆ దేశంలో వైర‌స్ ప్ర‌బ‌లి ఉంటుంద‌ని లేదా ఏదైనా అకాల విప‌త్తు వ‌చ్చి ఉంటుందేమో అన్న అనుమానాల‌ను పొంపియో వ్య‌క్తం చేశారు. 36 ఏళ్ల కిమ్‌.. చివ‌రిసారి ఏప్రిల్ 12వ తేదీన క‌నిపించారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆచూకీ లేరు.  కిమ్ ఆరోగ్యం క్షీణించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. బ్రెయిన్ డెడ్ అయిన‌ట్లు కూడా వ‌దంతులు వ్యాపించాయి. ద‌క్షిణ కొరియా ఆ వార్త‌ల‌ను కూడా కొట్టిపారేసింది. కానీ అమెరికా విదేశాంగ మంత్రి మాత్రం కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేశారు. కిమ్‌ను చూడ‌లేద‌ని, ఆయ‌న స‌మాచారం లేద‌ని, ఆ అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు పొంపియో తెలిపారు. ఉత్త‌ర కొరియాలో తీవ్ర ఆహార కొర‌త ఏర్ప‌డి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. 1990లో వ‌చ్చిన విప‌త్తు వ‌ల్ల ఉత్త‌ర కొరియాలో వేలాది మంది చ‌నిపోయారు.


logo