శుక్రవారం 05 జూన్ 2020
International - May 05, 2020 , 11:54:20

అమెరికా వ‌ద్ద వైర‌స్‌ ఆధారాలు లేవు : డ‌బ్ల్యూహెచ్‌వో

 అమెరికా వ‌ద్ద వైర‌స్‌ ఆధారాలు లేవు : డ‌బ్ల్యూహెచ్‌వో

హైద‌రాబాద్‌: వుహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్ వ్యాపించిన‌ట్లు చెబుతున్న అమెరికా దానికి సంబంధించిన ఆధారాల‌ను చూప‌డం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  ఆ దేశం ద‌గ్గ‌ర ఎటువంటి ఆధారం లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.అమెరికా నుంచి ఎటువంటి డేటా కానీ, ఆధారం కానీ అంద‌లేద‌ని, ఇది కేవ‌లం ఊహాజ‌నిత‌మైన ఆరోప‌ణ మాత్ర‌మే అని ఆయ‌న అన్నారు. వుహాన్‌ ల్యాబ్ నుంచే క‌రోనా వ్యాపించిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దేప‌దే ఆరోపించారు. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పొంపియో కూడా ఇవే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వైర‌స్ పుట్టుక‌కు సంబంధించి ఎవ‌రి ద‌గ్గ‌ర ఎటువంటి ఆధారం ఉన్నా దాన్ని స్వీక‌రిస్తామ‌ని మైఖేల్‌ తెలిపారు.ఒక‌వేళ అలాంటి స‌మాచారం ఉంటే, అది ప‌బ్లిక్ హెల్త్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌గా మారుతుంద‌న్నారు.

ఒక‌వేళ అమెరికా వ‌ద్ద డేటా, కానీ ఆధారాలు కానీ ఉంటే, అప్పుడు ఆ దేశామే ఆ డేటాను షేర్ చేయ‌వ‌చ్చు అన్నారు.  ప్ర‌స్తుతం వైర‌స్‌కు సంబంధించి 15 వేల జ‌న్యుక్ర‌మ‌ వివ‌రాలు త‌మ ద‌గ్గ‌ర‌ ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణుడు మారియా వాన్ కెర్‌ఖోవ్ తెలిపారు. అయితే ఆ వివ‌రాల‌ను ప‌రిశీలించిన త‌మ‌కు, ఆ వైర‌స్ స‌హ‌జ‌సిద్ధ‌మైన‌దే అని తేలిన‌ట్లు చెప్పారు. స‌హ‌జంగా క‌రోనా వైర‌స్ గ‌బ్బిల్లాల్లో ఉంటుంద‌ని, కానీ మ‌నుషుల‌కు ఎలా పాకింద‌న్న విష‌యాన్ని నిర్దారించాల‌ని, ఎటువంటి జంతువు ఈ క్ర‌మంలో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిందో ఇంకా అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌ని సైంటిస్టులు తెలిపారు. త‌మ ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారాన్ని అన్ని దేశాల‌కు షేర్ చేసిన‌ట్లు ర్యాన్ తెలిపారు. చైనా శాస్త్ర‌వేత్త‌ల నుంచి కూడా మ‌నం నేర్చుకోవాల‌న్నారు.  శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో విచార‌ణ జ‌ర‌గాల‌ని, వైర‌స్ ఏ జీవిలో ఉంది, అది ఏ జీవిని హోస్ట్‌గా చేసుకుని వ్యాపించిందో లాంటి అంశాల‌ను స్ట‌డీ చేయాల‌న్నారు. logo