శనివారం 06 జూన్ 2020
International - Apr 25, 2020 , 01:24:53

ఎండకు కరోనా ఖతం!

ఎండకు కరోనా ఖతం!

వాషింగ్టన్‌: సూర్యకాంతిలో కరోనా వైరస్‌ త్వరగా నశిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో కరోనా కట్టడికి ఎండాకాలం కలిసివస్తుందనే ఆశలు రేకెత్తించారు. అమెరికా ప్రభుత్వ విభాగమైన ‘హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ అధికారి  బిల్‌ బ్రయాన్‌ గురువారం వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. అతినీలలోహిత కిరణాలు కరోనాపై గణనీయ ప్రభావాన్ని చూపుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఎండ వేడి పెరిగిన కొద్దీ ఏదేని ఉపరితలం లేదా గాలిలో ఉన్న వైరస్‌ వేగంగా చనిపోతున్నదని చెప్పారు. ఉష్ణోగ్రతలు 21-24 డిగ్రీ సెల్సియస్‌ మధ్య, గాలిలోని తేమ 20 శాతం ఉన్నప్పుడు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులపై ఉండే కరోనా వైరస్‌ జీవిత కాలం 36 గంటలు ఉంటే.. సూర్యకాంతిలో కొన్ని నిమిషాల్లోనే వైరస్‌ చనిపోయిందని చెప్పారు. ఇదే ఉష్ణోగ్రతల వద్ద గాలిలో వైరస్‌ జీవితకాలం దాదాపు రెండు గంటలు ఉండగా.. సూర్యకాంతిలో కేవలం ఒకటిన్న నిమిషంలోనే నశించిందన్నారు. అయితే దీనికి సబంధించిన పత్రాలను మాత్రం విడుదల చేయలేదు.


logo