శనివారం 30 మే 2020
International - May 17, 2020 , 10:13:25

బిల్ గేట్స్ క‌రోనా టెస్టింగ్‌ను నిలిపేసిన అమెరికా

బిల్ గేట్స్ క‌రోనా టెస్టింగ్‌ను నిలిపేసిన అమెరికా

హైద‌రాబాద్‌: బిల్ గేట్స్ ఫౌండేష‌న్ నిర్వ‌హిస్తున్న క‌రోనా నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌ల కార్య‌క్ర‌మాన్ని అమెరికా ప్ర‌భుత్వం అడ్డుకున్న‌ది.  ఆ దేశంలోని సియాటిల్ న‌గ‌రంలో బిల్ గేట్స్ ఆధ్వ‌ర్యంలో స్కాన్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. స్థానికుల నుంచి క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల కోసం న‌మోనాలను సేక‌రిస్తున్నారు. అయితే ఆ కార్య‌క్ర‌మాన్ని నిలిపివేయాల‌ని ఆ దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిష్ట్రేష‌న్ సంస్థ‌ పేర్కొన్న‌ది.  ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా.. ఆ న‌గ‌రంలోని ప్ర‌తి ఒక్క‌రికీ స్కాన్ ప్రోగ్రామ్ కింద టెస్ట్ కిట్ల‌ను జారీ చేస్తున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని నిలిపివేయాల‌ని ఎఫ్‌డీఐ పేర్కొన్న‌ట్లు బిల్ గేట్స్ సంస్థ తెలిపింది. సియాటిల్ క‌రోనా అసెస్‌మెంట్ నెట్వ‌ర్క్‌(స్కాన్‌)లో భాగంగా ప్ర‌జ‌ల నుంచి ర‌క్త‌న‌మోనాలు సేక‌రిస్తున్నారు. క‌రోనా నిర్ధార‌ణ కోసం ఆ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. కానీ స్కాన్ కార్య‌క్ర‌మానికి ప్ర‌భుత్వ అనుమ‌తులు లేవ‌ని ఎఫ్‌డీఐ పేర్కొన్న‌ది. స్కాన్ ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యం, భ‌ద్ర‌త‌పై ఎటువంటి అనుమానాలు లేవ‌ని, కానీ ఆ ప్రోగ్రామ్‌కు ప్ర‌భుత్వ అనుమ‌తి లేద‌ని ఎఫ్‌డీఏ చెప్పింది. 


 


logo