ఆదివారం 17 జనవరి 2021
International - Dec 17, 2020 , 16:33:12

ఆ పంది మాంసం తినడానికి మంచిదేనంట!

ఆ పంది మాంసం తినడానికి మంచిదేనంట!

వాషింగ్టన్‌ : ఇకపై అమెరికాలో జన్యుపరంగా అభివృద్ధి చెందిన (జీఎం) పందులను తినొచ్చు. ఈ పంది మాంసం ఆరోగ్యానికి మంచిదేనని అమెరికాకు చెదిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. మానవ ఆహారంతోపాటు వైద్య ఉపయోగం కోసం జెనెటికల్లి మోడిఫైడ్‌ జంతువును ఆమోదించడం ఎఫ్‌డీఏ చరిత్రలో ఇదే మొదటిసారి. 2015 లో జీఎం సాల్మన్ చేపలను ఆహారం కోసం ఆమోదించగా.. రెండవ జీఎంగా పందులు కావడం విశేషం. అలెర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యే పందులలో లభించే చక్కెర ఆల్ఫా-గాల్‌ను తొలగించడానికి ఇంజనీరింగ్ చేసినట్లు తెలుస్తున్నది.

గాల్‌సేఫ్ పందులుగా పిలువబడే జెనెటికల్లి మోడిఫైడ్‌ పందుల నుంచి వచ్చే ఆహారం “సాధారణ ప్రజలకు తినడానికి సురక్షితం” అని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. మెయిల్ ఆర్డర్ ద్వారా ఈ రకం మాంసాన్ని విక్రయించవచ్చునని కూడా సూచించింది. ఈ రకం పంది మాంసాన్ని నేరుగా విక్రయించే ఆలోచన లేదని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్ప్ ప్రతినిధి డీవీ స్టీడ్మాన్‌ చెప్పారు. మాంసం ఉత్పత్తిదారులతో భాగస్వామ్యం  చేసే సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆల్ఫా-గాల్ సిండ్రోమ్ ఉన్న రోగులకు ఆల్ఫా-గాల్ ఫ్రీ, పూర్తి-అవయవ మార్పిడిపై దృష్టి పెట్టడం తమ తక్షణ లక్ష్యమని ఆయన తెలిపారు.  ప్రస్తుతం జన్యు సవరణ “మా ప్రిలినికల్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ (అమానవీయ వనరుల నుంచి మానవులకు మార్పిడి) అభివృద్ధి కార్యక్రమం కోసం ప్రస్తుతం పందులలో ఉపయోగిస్తున్న 10 సవరణలలో ఒకటి” అని స్టీడ్మాన్ తెలిపారు. మానవులలో మార్పిడి చేయగల అవయవాల యొక్క క్లిష్టమైన కొరతను పరిష్కరించడానికి మా పరిశోధనలు ఏదోఒక రోజు సహాయపడుతాయని ఆశిస్తున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇలాఉండగా, జన్యుపరంగా మార్పు చెందిన పందుల నుంచి వచ్చిన మాంసాన్ని అలెర్జీ ఉన్నవారిపై ఇంకా పరీక్షించలేదని అమెరికాలో ఉన్న లాభాపేక్ష లేని సంస్థ - యుఎస్ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వెల్లడించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.