మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 19:50:43

కొవిడ్‌-19 నిర్ధారణకు కొత్త టెస్ట్‌ వచ్చేసింది..!

కొవిడ్‌-19 నిర్ధారణకు కొత్త టెస్ట్‌ వచ్చేసింది..!

వాషింగ్టన్‌: ఇప్పటివరకూ ముక్కు, గొంతులోని తెమడను తీసి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అయితే, ఇది చాలా బాధతో కూడుకున్నది. తెమడ శాంపిల్స్‌ తీసిన చాలాసేపటి వరకూ నొప్పి ఉంటోంది. అయితే, దీనినుంచి ఉపశమనం లభించనుంది. లాలాజల నమూనాలను విశ్లేషించి కొవిడ్‌ను నిర్ధారించే కొత్త పరీక్షా పద్ధతిని యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించింది.

‘ఈ రోజు లాలాజల కొవిడ్‌-19 డయాగ్నొస్టిక్‌ పరీక్ష కోసం యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు అత్యవసర వినియోగ అధికారాన్ని జారీ చేశాం. ఇది లాలాజల నమూనాలను ప్రాసెస్‌ చేసే కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నది.’అని ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా,  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ డేటాబేస్ ప్రకారం, అమెరికాలో 5,354,664 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 1,69,405 మంది మరణించారు.  logo