సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 22, 2020 , 13:36:55

T3Xతో.. 30 సెక‌న్ల‌లో క‌రోనా మాయం

T3Xతో.. 30 సెక‌న్ల‌లో క‌రోనా మాయం

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ఆమోదం పొందిన  T3X ఔష‌ధాన్ని ఓ ఫార్మా కంపెనీ క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌కు వినియోగించింది. అయితే  T3Xతో కేవ‌లం 30 సెక‌న్ల‌లోనే క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకున్న‌ట్లు ఆ ఫార్మా కంపెనీ చెప్పింది. అమెరికాలో ఓవ‌ర్ ద కౌంట‌ర్ రూపంలో  T3X ఆయింట్మెంట్‌ను అమ్ముతుంటారు. ఈ ఔష‌ధంతో క‌రోనా వైర‌స్‌ను సంపూర్ణంగా చంపేయ‌డం కానీ, వ్యాప్తిని అరిక‌ట్ట‌డం చేయ‌వ‌చ్చు అని  ఫార్మా కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. అయితే ముక్కు నుంచి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించే కేసుల‌ను ఈ చికిత్స‌తో అదుపు చేయ‌వ‌చ్చు అని అడ్వాన్స్‌డ్ పెనెట్రేష‌న్ టెక్నాల‌జీ సీఈవో డాక్ట‌ర్ బ్రియాన్ హూబ‌ర్ తెలిపారు. ఇండియానా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఆ కంపెనీ ఉన్న‌ది. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో  T3Xతో చికిత్స తొలి ద‌శ ర‌క్ష‌ణ‌గా మారుతుంద‌ని ఆ కంపెనీ చెప్పింది. 

ముక్కు ద్వారా క‌రోనా వైర‌స్ శ‌రీరంలోకి వెళ్ల‌కుండా ఉండేందుకు  T3X ఆయింట్మెంట్ మెరుగ్గా ప‌నిచేస్తుంద‌ని హూబ‌ర్ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనా కేసుల్లో ఎక్కువ శాతం వైర‌స్ సంక్ర‌మ‌ణ ముక్కు ద్వారా జ‌రిగిన‌ట్లు మ‌సాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప‌రిశోధ‌కులు గుర్తించారు. అలాంటి కేసుల్లో ఈ మందు ప‌నిచేస్తుంద‌ని డాక్ట‌ర్ హూబ‌ర్ తెలిపారు.  T3X మందు ఎఫ్‌డీఏ వ‌ద్ద రిజిస్ట‌ర్ అయి ఉంద‌ని, ప్రిస్‌స్క్రిప్ష‌న్ లేకుండానే ఆ మందును అమ్ముతార‌న్నారు.  

లండ‌న్‌కు చెందిన వైరాల‌జీ రీస‌ర్చ్ స‌ర్వీసెస్ లిమిటెండ్ సంస్థ .. APT™ T3X మందుకు సంబంధించిన యాంటీ వైర‌స్ ప్ర‌భావాన్ని స్ట‌డీ చేసింది. క‌రోనా వైర‌స్ (ఎన్ఎల్‌63), ఇన్‌ఫ్లూయాంజా ఏ వైర‌స్‌ల‌ను ఆ మందు మెరుగ్గా అదుపుచేసిన‌ట్లు గుర్తించారు.  APT™ T3Xతో సెక‌న్ల‌లోనే వైర‌ల్ లోడ్‌ను త‌గ్గించ‌వచ్చు అని ప‌రిశోధ‌కులు తేల్చారు.  మాన‌వుల్లో క‌నిపించే క‌రోనా వైర‌స్ ఎన్ఎల్‌63 యాక్టివిటీని 99.9 శాతం త‌గ్గిస్తుంద‌ని గుర్తించారు. మే, జూన్ నెలల్లో టెస్టింగ్ జ‌రిపిన‌ట్లు చెప్పారు. మూడుసార్లు యాంటీ వైర‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. 

తాజావార్తలు


logo