మంగళవారం 31 మార్చి 2020
International - Feb 07, 2020 , 00:51:59

భారత్‌లో ఆందోళనకర పరిస్థితులు: అమెరికా

 భారత్‌లో ఆందోళనకర పరిస్థితులు: అమెరికా

వాషింగ్టన్‌: మతపరమైన స్వేచ్ఛ విషయంలో భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగడాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేసింది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ ఇటీవల తాను భారత్‌లో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో భేటీ అయ్యాయని, ఆ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశానని, ఆయా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశానని చెప్పారు. ‘భారత రాజ్యాంగం ఆ దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. అంతేగాక ప్రజల మత స్వేచ్ఛకు రక్షణ కూడా కల్పించింది. కాబట్టి ఆ దేశంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాలి. చట్టాలు కూడా అదే విధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితులు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి’ అని అమెరికా ఉన్నతాధికారి పేర్కొన్నారు.US, India,religious freedom,  citizenship law


logo
>>>>>>