శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 17:30:57

పోలీసుల్ని మించిన కుక్క.. రోడ్డు మీద ఎంత హంగామా చేసిందో!

పోలీసుల్ని మించిన కుక్క..  రోడ్డు మీద ఎంత హంగామా చేసిందో!

టైం వ‌స్తే ఎలాంటి వారైనా సంచ‌ల‌నం సృష్టించ‌వ‌చ్చు. దీనికి ప్ర‌త్యేక‌మైన ప్ర‌ణాళిక కూడా ఏం అవ‌స‌రం లేదు. అలా ఓ కుక్క‌పిల్ల సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ అయిపోయింది. పెట్స్ ఇంట్లో ఉంటేనే అటూ ఇటూ కాళ్ల‌కు అడ్డం ప‌డుతుంటాయి. అలాంటిది రోడ్డు మీద‌కు వ‌స్తే వాహ‌న‌దారుల‌ను ఎంత‌లా క‌న్‌ఫ్యూజ్ చేసి ప్ర‌మాదాల‌కు గురిచేసేస్తుంది. అస‌లు ఏం జ‌రిగిందో విష‌యానికి వ‌ద్దాం..

అమెరికాలోని మ్యారీలాండ్‌లో ఓ కుక్క రోడ్డు మీద‌కు వ‌చ్చేసింది. మాంటాగ్మెరీ కౌంటీలోని  I-495 బెల్ట్‌వేలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఉన్న కుక్క రోడ్డు మీద‌కు వ‌చ్చి అడ్డ‌దిడ్డంగా ప‌రుగులు పెట్టింది. దీనివ‌ల్ల వేగంగా దూసుకెళ్లే వాహ‌నాలు దాన్ని ఢీకొట్టి ప్ర‌మాదానికి గుర‌వుతుందేమో అని ముందుగా ఆలోచించి పోలీసులు కుక్క‌ను ప‌ట్టుకునేందుకు దాని వెనుకే ప‌రుగులు పెట్టారు. దీని కార‌ణంగా అక్క‌డ ట్రాఫిక్ కూడా నెల‌కొన్న‌ది. కుక్క వేగానికి పోలీసులు హెలికాఫ్ట‌ర్‌ల‌ను కూడా రంగంలోకి దించారు.  ఎట్ట‌కేలకు ఆ కుక్కను ప‌ట్టుకొని రోడ్డు మీద ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. logo