బుధవారం 03 జూన్ 2020
International - Apr 11, 2020 , 09:11:08

అమెరికాలో ఒక్క రోజే 2108 మంది మృతి..

అమెరికాలో ఒక్క రోజే 2108 మంది మృతి..

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఒక్క రోజే రెండు వేల మందికిపైగా అమెరికాలో మ‌ర‌ణించారు. గ‌త 24 గంట‌ల్లో 2108 మంది చ‌నిపోయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. దేశ‌వ్యాప్తంగా వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 5 ల‌క్ష‌లు దాటింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధికంగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య ఇట‌లీలో ఎక్కువ‌గా ఉన్న‌ది. అయితే త్వ‌ర‌లోనే ఆ దేశాన్ని అమెరికా దాటి వేయ‌నున్న‌ది. కానీ వైట్‌హౌజ్ నిపుణులు మాత్రం దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌19 కేసులు స్థిమితానికి వ‌స్తున్న‌ట్లు తెలిపారు. వైర‌స్ సంక్ర‌మ‌ణ కొంత త‌గ్గిన‌ట్లు అనిపిస్తున్నా.. మ‌ర‌ణాల రేటు మాత్రం అధికంగానే ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వైట్‌హౌజ్ అధికారి డెబోరా బ్రిక్స్ తెలిపారు.  

అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18849గా ఉన్న‌ది. ఈ మ‌ర‌ణాల్లో యాభై శాతం న్యూయార్క్‌లోనే సంభ‌వించాయి. ఇట‌లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 18900 మంది మ‌ర‌ణించారు.  శుక్ర‌వారం రోజున మ‌ర‌ణాలు అత్య‌ధికంగా ఉంటాయ‌ని ఇప్ప‌టికే ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. ఆ త‌ర్వాత మే నెల వ‌ర‌కు క్ర‌మంగా మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గ‌నున్న‌ట్లు వాళ్లు భావిస్తున్నారు.  సోష‌ల్ డిస్టాన్సింగ్ లాంటి కీల‌కమైన ఆంక్ష‌ల‌ను మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో అమ‌లు చేయాల‌ని అమెరికా భావిస్తున్న‌ది.  న్యూయార్క్‌, న్యూజెర్సీ, చికాగో లాంటి ప్ర‌దేశాల్లో ఇన్‌ఫెక్ష‌న్ రేటు త‌గ్గిన‌ట్లు బ్రిక్స్ తెలిపారు.
logo