గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 09, 2020 , 14:11:44

అమెరికాలో 5 మిలియన్లకు చేరిన కరోనా కేసులు

అమెరికాలో 5 మిలియన్లకు చేరిన కరోనా కేసులు

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మహమ్మారి ఉద్ధృతి పెరుగుతుండగా మరణాలు అదేరీతిలో సంభవిస్తుండడంతో అమెరికన్లు వణికిపోతున్నారు. ఆ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5 మిలియన్ల మంది వైరస్‌ బారినపడినట్లు జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ తన నివేదికలో వెల్లడించింది. జనవరి 22న అమెరికాలో తొలి కరోనా కేసు నమోదు కాగా 6 నెలల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 58 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,243 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,61,300కు  చేరింది. ఇదిలాఉండగా ప్రపంచ వ్యాప్తంగా 19.4 మిలియన్ మంది కరోనా బారినపడగా 11.7 మిలియన్లు మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 7,21,800 మంది వైరస్ బారినపడి మృతి చెందారు.


logo