మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 21:25:12

అమెరికాలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

అమెరికాలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

వాషింగ్టన్‌ : అమెరికాలో కొవిడ్-19 కొత్త కేసులు రెండు నెలల గరిష్ఠాన్ని తాకాయి. కొత్తగా 58,000 కేసులు నమోదయ్యాయి. మిడ్వెస్ట్లో దవాఖానలో వరుసగా ఐదవ రోజు రికార్డు స్థాయిలో కేసులు వచ్చాయి. మిడ్ వెస్ట్రన్ రాష్ట్రాలైన ఇండియానా, మిన్నెసోటా, మిస్సౌరీ, ఒహియోతో పాటు 50 రాష్ట్రాలలో రికార్డు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. విస్కాన్సిన్, ఇల్లినాయిస్‌లలో వరుసగా రెండోరోజు 3,000 కొత్త కేసులు వచ్చాయి. 

పాశ్చాత్య రాష్ట్రాలైన మోంటానా, న్యూ మెక్సికో, వ్యోమింగ్ కూడా ఓక్లహోమా, వెస్ట్ వర్జీనియా మాదిరిగానే ఎక్కువగా కేసులు వచ్చినట్లు తెలుస్తున్నది. అక్టోబర్‌లో ఇప్పటివరకు 19 రాష్ట్రాలలో కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశవ్యాప్తంగా కేసులు పుంజుకున్న నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ బాల్కనీ నుంచి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించి శనివారం తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 

దవాఖాన నుంచి వైట్‌హౌస్‌కు తిరిగి వెళ్లిన తరువాత తన మొదటి ప్రచార ర్యాలీని నిర్వహించడానికి అతను సోమవారం సెంట్రల్ ఫ్లోరిడాకు వెళ్లాల్సి ఉన్నది. అమెరికాలో ఇప్పటివరకు 2,13,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మాస్క్‌ ధరించకుండా వైట్‌హౌస్‌లో అధ్యక్ష కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల విమర్శలు ఎదుర్కొన్నారు. కాగా, ఆర్కాన్సాస్, కాన్సాస్, మిస్సౌరీ, మోంటానా, నార్త్ డకోటా, ఓక్లహోమా, విస్కాన్సిన్ రాష్ట్రాలు దవాఖానల్లో చేరిన కొవిడ్ -19 రోగుల రికార్డు సంఖ్యను శుక్రవారం నివేదించాయి. మిడ్‌వెస్ట్‌లో దవాఖానలో చేరిన రోగుల సంఖ్య దాదాపు 9,000 కు పెరిగింది. జాతీయంగా ఇప్పుడు 34,000 మందికి పైగా హాస్పిటళ్లలో ఉన్నారు. గత రెండు వారాల్లో కొవిడ్‌-19 కేసుల సంఖ్యల 18 శాతం పెరిగింది. 


logo