సోమవారం 13 జూలై 2020
International - Jun 14, 2020 , 10:36:12

కరోనా రోగి వైద్యం ఖర్చు రూ. 8 కోట్లు

కరోనా రోగి వైద్యం ఖర్చు రూ. 8 కోట్లు

వాషింగ్టన్‌ : అమెరికాకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. మృత్యువుతో పోరాడి గెలిచాడు. కరోనా వైరస్‌ సోకిన ఆయన చనిపోతాడునుకుని వైద్య సిబ్బంది అందరూ భావించారు. కానీ చివరకు ఆ వైరస్‌ నుంచి కోలుకుని బతికాడు ఆ వృద్ధుడు. ఆ పెద్ద మనిషికి 62 రోజుల పాటు చికిత్స అందించినందుకు ఏకంగా రూ. 8 కోట్ల బిల్లు(1.1 మిలియన్‌ డాలర్లు) వేశారు. ఈ బిల్లును చూసి వృద్ధుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. 

మిచ్చెల్‌ ఫ్లోర్‌ అనే వృద్ధుడు.. కరోనాతో మార్చి 4న ఆస్పత్రిలో చేరాడు. అతను ఒకానొక దశలో.. చనిపోతాడని నర్సులు భావించారు. దీంతో వృద్ధుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి అతనితో మాట్లాడించారు. కానీ మొత్తానికి మిచ్చెల్‌ కరోనా నుంచి కోలుకుని మే 5వ తేదీన డిశ్చార్జి అయ్యాడు. 

ఇక డిశ్చార్జి అయిన మిచ్చెల్‌ తన మెడికల్‌ బిల్లును చూసి షాక్‌ అయ్యాడు. 181 పేజీల బిల్లులో 1,122,501.04 డాలర్లు(రూ. 8 కోట్లు) వేశారు. ఇంటెన్సివ్‌ కేర్‌ రూమ్‌కు 9,736 డాలర్లు, 42 రోజుల పాటు స్టెరైల్‌ రూమ్‌లో ఉంచినందుకు 409,000 డాలర్లు, 29 రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స అందించినందుకు 82,000 డాలర్లు, ప్రొగ్నోసిస్‌ కోసం 100,000 డాలర్లు బిల్లు వేశారు. 


logo