ఆదివారం 31 మే 2020
International - Apr 21, 2020 , 15:07:50

మ‌హింద్రా సంస్థ‌కు అమెరికా ప్ర‌శంస‌లు

మ‌హింద్రా సంస్థ‌కు అమెరికా ప్ర‌శంస‌లు

వాషింగ్టన్ : కరోనా నియంత్ర‌ణ‌కు స‌హాయం అందిస్తున్న మ‌హీంద్రా కంపెనీపై అమెరికా ప్ర‌శంస‌లు గుప్పించింది. క‌రోనా పై పోరులో తనవంతు సాయం చేస్తున్న కంపెనీ ప్ర‌తినిధులు, సిబ్బందికి  ప్ర‌త్యేకంగా అభినందించింది. స్టేట్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ మైక్ పాంపియా ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్ ను అభినందించారు. ఇలాంటి క్లిష్ట‌స‌మ‌యంలో లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంట్ రెడీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.  క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో మాస్క్ లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు ఇతర ఎక్విప్ మెంట్ కొరత లేకుండా ఉండేందుకు మహీంద్రా సంస్థ వాటిని త‌యారు చేస్తుంది. అటు అమెరికాలోని ప్లాంట్లలోనూ ఫేస్ మాస్క్ లు, షీల్డ్స్ త‌యారు చేస్తోంది. ఈ విషయాన్ని అక్కడి లోకల్ మీడియా ద్వారా గుర్తించిన మైక్ పాంపియా మహీంద్రా సంస్థ సేవలను  అభినందించారు.


logo