శనివారం 06 జూన్ 2020
International - May 12, 2020 , 17:24:33

భారత్‌కు అమెరికా సీడీసీ కరోనా సాయం 27 కోట్లు

భారత్‌కు అమెరికా సీడీసీ కరోనా సాయం 27 కోట్లు

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి నియంత్రణకు భారత్ చేపడుతున్న కార్యక్రమానికి అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) 36 లక్షల డాలర్ల (సుమారు రూ. 27 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. ఢిల్లీలోన అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఈ సంగతిని తెలియజేసింది. నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన చర్యల నిమిత్తం ఈ భారత్ ఈ సొమ్మును వ్యయం చేస్తుంది. మొదటి విడత సహాయాన్ని కరోనా పరీక్షలకు ఉపయోగిస్తారు. ప్రస్తుత మహమ్మారి మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే ముప్పులను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రజారోగ్య సిబ్బంది వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సీడీసీ స్థానిక భాగస్వాములతో కలిసిపనిచేస్తుంది. గత జనవరి నుంచి సీడీసీ భారత కార్యాలయం జాతయ, ప్రాంతీయ సంస్థలతో భాగస్వామ్య కృషి జరుపుతున్నది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ అధికారులు, వైద్యులు, నర్సులు, హాస్పిటల్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. హెచ్ఐవీ, టీబీ, మలేరియా నియంత్రణ, పోలియో నిర్మూలన, ఇతర మహమ్మారులను ఎదుర్కోవడంలో సంసిద్ధత విషయంలో భారత్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో సీడీసీ దీర్ఘకాలిక అనుబంధాన్ని కొనసాగిస్తున్నది. గత 20 ఏళ్లుగా వివిధ ఆరోగ్య కార్యక్రమాల కింద 280 కోట్ల డాలర్ల సహాయాన్ని వివిధ అమెరికా ప్రభుత్వ సంస్థలు అందించాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.logo