శనివారం 04 జూలై 2020
International - Jul 01, 2020 , 11:05:50

రెమ్‌డిసివిర్ మొత్తం ఔష‌ధాల్ని కొనేసిన అమెరికా

రెమ్‌డిసివిర్ మొత్తం ఔష‌ధాల్ని కొనేసిన అమెరికా

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ చికిత్స‌లో రెమ్‌డిసివిర్ ఔష‌ధం మెరుగ్గా ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఔష‌ధాన్ని అమెరికా సొంతం చేసుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి అవుతున్న ఈ ఔష‌ధాల‌ను మొత్తం ఆ దేశ‌మే కొనేసింది.  రెమ్‌డిసివిర్‌తో అమెరికా అసాధార‌ణ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా అయ్యే ఆ ఔష‌ధాల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వం డీల్ కుదుర్చుకున్న‌ది.  గిలీడ్ సైన్సెస్ సంస్థ ఈ ఔష‌ధాన్ని త‌యారు చేస్తున్నారు.  ఈ ఔష‌ధం వాడిన వారు చాలా వేగంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌ట్లు తేలింది.  

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ శాఖ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  రెమ్‌డిసివిర్‌ను ఉత్ప‌త్తి చేసే గిలీడ్ సంస్థ‌తో ట్రంప్ స‌ర్కార్ అద్భుత‌మైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు పేర్కొన్న‌ది.  జూలైలో జ‌రిగే వంద శాతం ఉత్ప‌త్తిని అంటే సుమారు 5 ల‌క్ష‌ల డోస్‌ల‌ను త‌మ‌కే ఇవ్వాల‌ని గిలీడ్‌తో అమెరికా డీల్ చేసుకున్న‌ది.  ఆగ‌స్టులో 90 శాతం, సెప్టెంబ‌ర్‌లో 90 ఔష‌ధ స‌ర‌ఫ‌రాను కూడా త‌మ‌కే ఇవ్వాల‌ని ట్రంప్ స‌ర్కార్ గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది.  

ద‌క్షిణ కొరియాలో రెమిడిసివిర్ ఔష‌ధ వినియోగం ప్రారంభ‌మైంది. గిలీడ్ సైన్సెస్ ఆ ఔష‌ధాన్ని ద‌క్షిణ కొరియా డొనేట్ చేసింది. అయితే ఆగ‌స్టులో ఆ మాత్ర‌ల‌ను ఖ‌రీదు చేసేందుకు కొరియా సీడీసీ శాఖ‌తో ఒప్పందం జ‌ర‌గ‌నున్న‌ది. న్యూమోనియా వ్యాధితో బాధ‌ప‌డేవారు, ఆక్సిజ‌న్ థెర‌పి తీసుకుంటున్న‌వారికి రెమ్‌డిసివిర్ ఔష‌ధం ప‌నిచేస్తుంద‌ని గిలీడ్ కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 

ఎబోలా వ్యాధి చికిత్స‌లోనూ ఈ ఔష‌ధాన్ని వాడారు.  ఇది యాంటీ వైర‌ల్ మెడిసిన్‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ డ్ర‌గ్‌ ట్ర‌య‌ల్స్ జ‌రిగింది.  వ్యాధి ల‌క్ష‌ణాల‌ను 15 రోజుల నుంచి 11 రోజుల‌కు త‌గ్గించ‌డంలో ఔష‌ధం ఉప‌యోగ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే ద‌క్షిణ కొరియాకు ఎన్ని డోస్‌ల ఔష‌ధాల్ని అమెరికా డొనేట్ చేసిందో ఇంకా క్లియ‌ర్‌గా తెలియ‌దు.  
logo