శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 11:54:36

54 శాతం కేసులు.. ఆ నాలుగు దేశాల్లోనే !

 54 శాతం కేసులు.. ఆ నాలుగు దేశాల్లోనే !

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభిస్తూనే ఉన్న‌ది. అయితే కోవిడ్‌19 కేసుల్లో 54 శాతం.. కేవ‌లం నాలుగు దేశాల్లోనే న‌మోదు అయ్యాయి. భార‌త్‌, అమెరికా, బ్రెజిల్‌, ర‌ష్యా దేశాల్లో న‌మోదు అయిన క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా 54 శాతం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఈ నాలుగు దేశాల్లోనే 43 శాతం మ‌ర‌ణాలు కూడా సంభ‌వించాయి.  ఇక ఈ నాలుగు దేశాల్లో యాక్టివ్  కేసుల సంఖ్య 59 శాతంగా ఉన్నది.  ఇండియాలో కోవిడ్‌19 రిక‌వ‌రీ రేటు 63 శాతంగా న‌మోదు అయ్యింది. అది ఇవాళ 63.33 శాతానికి పెరిగిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. 

బ్రెజిల్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 ల‌క్ష‌లు దాటింది. ఆ దేశంలో స‌గ‌టున రోజుకు వెయ్యి మంది వ‌ర‌కు మ‌ర‌ణిస్తున్నారు. మే నెల చివ‌ర్లో తొలిసారి క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఆ త‌ర్వాత క్ర‌మంగా మృతుల రేటు పెరుగుతున్న‌ది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు మిలియ‌న్లు దాటిన‌ట్లు ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది. మృతుల సంఖ్య ఆ దేశంలో 76 వేలు దాటింది.

క‌రోనా ప‌రీక్ష‌ల్లో భార‌త్ రెండ‌వ స్థానంలో నిలిచింది. అమెరికా త‌ర్వాత అత్య‌ధిక స్థాయిలో క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల‌ను భార‌త్ నిర్వ‌హించింది. అమెరికాలో మొత్తం 42 మిలియ‌న్ల మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఇండియాలో ఆ సంఖ్య 12 మిలియ‌న్లుగా ఉన్న‌ది. అమెరికాలో 35 ల‌క్ష‌ల మందికిపైగా పాజిటివ్ తేలారు. 1.38 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 13.6 మిలియ‌న్ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5.86 ల‌క్ష‌లుగా ఉన్న‌ది. 
logo