బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 23, 2020 , 11:32:20

చైనాపై ఆధార‌ప‌డ‌కండి.. భార‌త్‌ను కోరిన అమెరికా

చైనాపై ఆధార‌ప‌డ‌కండి.. భార‌త్‌ను కోరిన అమెరికా

హైద‌రాబాద్‌: చైనాపై ఆధార‌ప‌డడం త‌గ్గించుకోవాల‌ని భార‌త్‌ను అమెరికా కోరింది. స్వ‌దేశీ వ‌స్తువుల స‌ర‌ఫ‌రాను పెంచుకునే అంశంపై దృష్టి పెట్టాల‌ని అగ్ర‌రాజ్యం భార‌త్‌కు సూచ‌న చేసింది. టెలికమ్యూనికేష‌న్లు, మెడిక‌ల్ స‌ప్ల‌య్స కోసం చైనాపై ఆధార‌ప‌డ వ‌ద్దు అంటూ భార‌త్‌ను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో కోరారు.  చైనాతో ఆ దేశ సంబంధాలు దిగ‌జారిపోతున్న వేళ పొంపియా ఈ సూచ‌న చేశారు. ఇండియా ఐడియాస్ స‌మ్మిట్‌లో పాల్గొన్న పొంపియో మాట్లాడుతూ.. భార‌త్ మంచి స్థానంలో ఉన్న‌ద‌ని, ప్ర‌పంచ దేశాల న‌మ్మ‌కాన్ని ఆ దేశం పొందింద‌ని, అమెరికా కూడా భార‌త్‌ను విశ్వ‌సిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.  

ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లోనూ చైనా తీరును అమెరికా త‌ప్పుప‌ట్టింది.  స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌కు చైనాయే కార‌ణ‌మ‌ని పొంపియా అన్నారు.  చైనా క‌మ్యూనిస్టు పార్టీ ప్ర‌వ‌ర్త‌న అమోద‌యోగ్యంగా లేద‌న్నారు.  పీఎల్ఏ ద‌ళాల వైఖ‌రే దానికి కార‌ణ‌మ‌ని పొంపియో ఆరోపించారు. చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో.. ఆ దేశానికి చెందిన 59 యాప్‌ల‌ను భార‌త్ బ్యాన్ చేసింది. ఇదే త‌ర‌హాలో అమెరికా కూడా చైనా యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని భావిస్తున్న‌ది.logo