శనివారం 30 మే 2020
International - Apr 07, 2020 , 17:56:16

వస్తే వచ్చేయండి లేకపోతే ఎక్కడివారు అక్కడే

వస్తే వచ్చేయండి లేకపోతే ఎక్కడివారు అక్కడే

హైదరాబాద్: ఇప్పటివరకు భారత్ నుంచి అమెరికా 1300 మంది పౌరులను వెనుకకు పిలిపించుకున్నది. ఈ వారం మరో ఐదు విమానాలు అమెరికాకు బయలుదేరనున్నాయి. అయితే ఇలా నిరంతరంగా విమానాలు అందుబాటులో ఉంటాయని హామీ లేదు. అందువల్ల అమెరికా పౌరులు వస్తే ఇప్పుడు వచ్చేయాలి. లేకపోతే ఎక్కడు ఉన్నవారు అక్కడే ఉండిపోవడానికి సిద్ధం కావాలని అమెరికా విదేశాంగశాఖ అండర్ సెక్రెటరీ (దక్షిణ, మధ్యాసియా) ఆలిస్ వెల్స్ స్పష్టం చేశారు. విదేశంలోనే గడపాలా లేక స్వదేశానికి వచ్చేయాలా అని ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నవారు ఎవరైనా ఉంటే వెంటనే ఓ నిర్ణయానికి రావాలని అన్నారు. లేకపోతే తర్వాత చాలాకాలం వరకు విమానయాన అవకాశం లభించదన్న ధోరణి వెల్స్ మాటల్లో వ్యక్తమైంది. విదేశాల్లో ఉన్న పౌరులకు సహాయం చేసేందుకు స్టేట్ డిపార్ట్‌మెంట్ ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉంటుంది. కానీ వెనుకకు రప్పించే కృషి ఇలా నిరంతరంగా కొనసాగుతుందని చెప్పలేం. కనుక నిర్ణయాన్ని వాయిదా వేయకుండా వెంటనే ఏదో ఒకటి తేల్చుకోవాలి అని ఆమె స్పష్టం చేశా్రు.


logo