శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 12, 2020 , 21:13:23

ఇక్కడ మిలిటరీ కుక్కలు సొంతంగా శిక్షణ పొందుతున్నాయ్‌..!

ఇక్కడ మిలిటరీ కుక్కలు సొంతంగా శిక్షణ పొందుతున్నాయ్‌..!

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా రక్షణ దళాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటాయి. అధునాతన ఆయుధాలు, క్షిపణులు, యుద్ధట్యాంకులను సమకూర్చుకుంటాయి. సైనికులకూ వాటిపై అవగాహన కల్పిస్తాయి. అయితే, యూఎస్‌ మిలిటరీ ఒక అడుగు ముందుకేసి జాగిలాలకు అధునాతన పద్ధతుల్లో శిశిక్షణనిస్తోంది. ఇన్‌స్ట్రక్టర్‌ అవసరం లేకుండానే వాటికవే సొంతంగా శిక్షణ పొందేలా అగ్‌మెంటెడ్‌ రియాలిటీ గాగుల్స్‌ను వాడుతున్నారు.  

సైన్యం, నేవీ, వైమానిక దళం, మెరైన్స్, పోలీసు విభాగాల్లో స్నిఫర్ డాగ్స్‌ లేదా పెట్రోల్ నార్కోటిక్స్ డిటెక్టర్ కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. డ్రగ్స్‌, ఆయుధాలను గుర్తిస్తుంటాయి. వీటికి శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఇన్‌స్ట్రక్టర్స్‌ ఉంటారు. వాళ్లు చెప్పినట్లుగా జాగిలాలు నేర్చుకుంటాయి. అయితే, యూఎస్‌ మిలిటరీ కుక్కలు సొంతంగా శిక్షణ పొందేలా అగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) పరిజ్ఞానాన్ని వాడుతోంది. ఈ టెక్నాలజీని కమాండ్ సైట్ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనిని యూఎస్‌ ఆర్మీ రీసెర్చ్ ల్యాబోరేటరీ నిర్వహిస్తోంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు