బుధవారం 27 మే 2020
International - Apr 14, 2020 , 12:22:50

హ‌ర్పూన్ మిస్సైళ్లు, లైట్ వెయిట్ టార్పిడోలు వ‌చ్చేస్తున్నాయి..

హ‌ర్పూన్ మిస్సైళ్లు, లైట్ వెయిట్ టార్పిడోలు వ‌చ్చేస్తున్నాయి..

హైద‌రాబాద్‌: హ‌ర్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్ మిస్సైల్స్‌తో పాటు లైట్ వెయిట్ టార్పిడోల‌ను భార‌త్‌కు అమ్మేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.  భార‌త్‌కు సుమారు 16 కోట్ల‌ డాల‌ర్ల ఖ‌రీదైన ఆయుధాల‌ను అమ్మ‌నున్న‌ట్లు అమెరికా స్ప‌ష్టం చేసింది. 10 ఏజీఎం-84ఎల్ హ‌ర్పూన్ బ్లాక్-2  ఎయిర్ లాంచ్ మిస్సైల్స్ ఖ‌రీదు సుమారు 92 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంది. దీంతో పాటు 16 ఎంకేఈ 54 లైట్‌వెయిట్ టార్పిడోలు, మూడు ఎంకే 54 ఎక్స‌ర్‌సైజ్ టార్పిడోల‌ను కూడా అమ్మ‌నున్నారు. వీటి ఖ‌రీదు 63 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంది. ఈ విష‌యాన్ని డిఫెన్స్ సెక్యూర్టీ కొఆప‌రేష‌న్ ఏజెన్సీ వేరువేరు ప్ర‌క‌ట‌న‌ల్లో తెలియ‌జేసింది. 

భార‌త ప్ర‌భుత్వం చేసిన అభ్య‌ర్థ‌న మేర‌కే ఆయుధాల‌ను అమ్మ‌నున్న‌ట్లు పెంట‌గాన్ పేర్కొన్న‌ది.  స్వ‌దేశీ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు, ప్రాంతీయ బెదిరింపుల‌ను తిప్పికొట్టేందుకు ఈ ఆయుధాల‌ను భార‌త్ వాడుతుంద‌ని పెంట‌గాన్ తెలియ‌జేసింది. హ‌ర్పూన్ మిస్సైళ్ల‌ను బోయింగ్‌, టార్పిడోల‌ను రేథియాన్ కంపెనీలు ఉత్ప‌త్తి చేస్తున్నాయి. అమెరికా అమ్ముతున్న ఆయుధాల‌తో భార‌త అమ్ముల‌పొది మ‌రింత ప‌టిష్టంగా మార‌నున్న‌ది. ఎంకే 54 టార్పిడోల‌తో యాంటీ స‌బ్‌మెరైన్‌ యుద్ధ ప్ర‌క్రియ‌లో పాల్గొవ‌చ్చు.  త‌మ విదేశీ విధానానికి మ‌ద్దుతు ఇచ్చే రీతిలోనే ఆయుధ ఒప్పందం జ‌రిగిన‌ట్లు పెంటగాన్ చెప్పింది.


logo