ఆ ఉగ్రవాది సమాచారమిస్తే 37 కోట్లు..

హైదరాబాద్: 2008లో ముంబైలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై అమెరికా ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా లేక పట్టిచ్చినా .. వారికి 50 లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. పాక్ ఉగ్ర సంస్థ లష్కరేలో సాజిద్ మిర్ సీనియర్ సభ్యుడిగా ఉన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి కేసులో అతను మోస్ట్ వాంటెడ్. రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్.. ఆ ఉగ్రవాదిపై నజరానా ప్రకటించింది. అతడి సమాచారం ఇస్తే 37 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై దాడులకు లష్కరే ఆపరేషన్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ చేశాడు. దాడుల ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ అతనే చేశాడు. 2011, ఏప్రిల్ 21వ తేదీన చికాగో కోర్టులో మిర్‌పై నేరాభియోగం నమోదు చేశారు. ఆ తర్వాత రోజున అరెస్టు వారెంట్ జారీ చేశారు. 2019లో ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో మిర్‌ను చేర్చారు.
తాజావార్తలు
- ఫ్యూచర్‌పై హీరో ‘ఐ’.. త్వరలో విద్యుత్ కారు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు