శుక్రవారం 05 జూన్ 2020
International - May 08, 2020 , 13:22:47

క‌రోనాపై అమెరికా, జ‌పాన్ ఉమ్మడిగా పోరు

క‌రోనాపై అమెరికా, జ‌పాన్ ఉమ్మడిగా పోరు

టోక్యో: కరోనా మ‌హ‌మ్మారిపై పోరులో ఉమ్మడిగా కలసి న‌డ‌వాల‌ని జపాన్, అమెరికా నిర్ణ‌యించాయి. వైర‌స్‌ను ఎదుర్కోవడానికి మెడిసిన్‌, వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం కలసి ప‌నిచేయనున్నారు. ఈ మేర‌కు జపాన్ ప్రధాని షింజో అబే, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇదే అంశంపై  ట్రంప్, అబే మధ్య దాదాపు 45 నిమిషాల పాటు ఫోన్ లో చర్చలు జరిగాయని పేర్కొన్నారు.  ఇంకా ఇరు దేశాల్లో వైర‌స్‌తో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల గురించి చ‌ర్చించారు.  మున్ముందు వైరస్ తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, మెడిసిన్స్, వ్యాక్సిన్ అభివృద్ధిపై మాట్లాడిన‌ట్లు వివ‌రించారు. దీంతో పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల బ‌లోపేతానికి ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.


logo