గురువారం 04 జూన్ 2020
International - Apr 15, 2020 , 09:48:52

అమెరికా శుభవార్త .... 240 రోజుల వరకు హెచ్‌-1బీ వీసా పొడిగింపు

అమెరికా శుభవార్త .... 240 రోజుల వరకు హెచ్‌-1బీ వీసా పొడిగింపు

  • హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికా శుభవార్త

వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ ఉద్యోగులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసా గడువును 8 నెలల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వీసా గడువు ముగిసిపోయినప్పటికీ కొందరు విదేశీయులు అమెరికాలోనే ఉన్నట్టు మేము గుర్తించాం. కరోనా కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయి. వీసా గడువును పొడిగించాల్సిందిగా వచ్చే దరఖాస్తులను అనుమతిస్తాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో తమ దేశ పౌరుల ఉద్యోగ అవకాశాలను పరిగణలోకి తీసుకుంటామని డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. అభ్యర్థులు సరైన సమయంలో దరఖాస్తు చేస్తే వారిని చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిగా పరిగణించబోమని, వారి వీసా గడువును 240 రోజుల వరకు పొడిగిస్తామని స్పష్టం చేసింది. 


logo