శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 02:47:11

ప్లాస్మా చికిత్సకు ఎఫ్‌డీఏ ఓకే

ప్లాస్మా చికిత్సకు ఎఫ్‌డీఏ ఓకే

  • చరిత్రాత్మక నిర్ణయమన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌ రోగులకు ప్లాస్మా చికిత్స అందించేందుకు ఆ దేశ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) అనుమతినిచ్చింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ప్లాస్మా చికిత్సను అందించవచ్చని పేర్కొన్నది. ఇప్పటికే దేశంలో ప్రయోగాత్మకంగా 70వేల మందికి ప్లాస్మా చికిత్స చేశారు. మెరుగైన ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అనుమతినిచ్చారు. ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వాగతించారు. చైనా వైరస్‌పై పోరులో ఇది చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. కరోనా మరణాలు తగ్గించడంతో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగనున్నది. అందులోనే ట్రంప్‌ను రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తిరిగి నామినేట్‌ చేశారు. మరోవైపు కరోనా చికిత్సలో ప్లాస్మా థెరఫీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. ఈ థెరఫీ కొవిడ్‌ వ్యాధి నివారణలో ఎలా పనిచేస్తుందన్న దానిపై ఇంకా నిర్ధారణకు రాలేదని, మరిన్ని ఫలితాలను విశ్లేషించాల్సిఉన్నదని తెలిపింది.


logo