శనివారం 04 జూలై 2020
International - Jun 15, 2020 , 16:39:45

నార్త్‌సీలో కూలిన అమెరికా యుద్ధ విమానం

నార్త్‌సీలో కూలిన అమెరికా యుద్ధ విమానం


హైద‌రాబాద్‌: అమెరికా వైమానిక ద‌ళానికి చెందిన యుద్ధ విమానం నార్త్‌సీలో కూలింది. అయితే ఈ ప్ర‌మాదంలో పైల‌ట్‌కు ఏం జ‌రిగింద‌న్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. 48వ ఫైట‌ర్ వింగ్‌కు చెందిన  ఎఫ్‌-15సీ ఈగ‌ల్ యుద్ధ విమానం శిక్ష‌ణ స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైంది.  ఏ కార‌ణం చేత విమానం కూలింద‌న్న దానిపైన కూడా స‌మాచారం లేదు. బ్రిట‌న్‌కు చెందిన రెస్క్యూ ద‌ళాలు.. నార్త్ సీలో ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి. లాకెన్‌హీత్ రాయ‌ల్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఈ శిక్ష‌ణ విమానం ఎగిరింది. లండ‌న్‌కు సుమారు 130 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఎయిర్‌ బేస్ ఉన్న‌ది. logo