సోమవారం 01 జూన్ 2020
International - Apr 26, 2020 , 01:21:12

సరదాగా అన్నా.. సీరియస్‌గా తీసుకోకండి

 సరదాగా అన్నా.. సీరియస్‌గా తీసుకోకండి

వాషింగ్టన్‌: కరోనా రోగుల్లోకి క్రిమిసంహారకాలు ఇంజెక్ట్‌ చేయాలని, యూవీ కాంతిని పంపాలంటూ బిత్తిరి సలహాలు ఇచ్చిన ట్రంప్‌.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో వెనక్కి తగ్గారు. తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. దానిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపారు. క్రిమి సంహారకాల్ని చేతులపై రుద్దుకోవాలని మాత్రమే తాను సూచించినట్టు చెప్పారు. తాను నిత్యం జర్నలిస్టులతో యుద్ధం చేస్తున్నానంటూ అసహనం వ్యక్తం చేశారు.


logo