మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Jul 11, 2020 , 21:33:46

70 శాతంమంది ఆఫ్ఘన్‌ చట్టసభ సభ్యులకు కరోనా

70 శాతంమంది ఆఫ్ఘన్‌ చట్టసభ సభ్యులకు కరోనా

కాబూల్‌: ఆప్ఘనిస్తాన్‌ను కొవిడ్‌-19 అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ ఆ దేశంలోని 60 నుంచి 70 శాతం మంది చట్టసభ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా, దీని బారినపడ్డ చాలామంది రాజకీయ నాయకులు కోలుకున్నారని హెరాత్ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు సిమిన్ బారెక్‌జాయ్ తెలిపారు.  ఇంకా కొందరు క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్నవారు త్వరలోనే కోలుకుని పార్లమెంట్‌ కార్యకలాపాల్లో తిరిగి పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటివరకూ 34,366 కొవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 994గా ఉంది. శుక్రవారం 172 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo