గురువారం 26 నవంబర్ 2020
International - Nov 21, 2020 , 01:40:49

ఆరేండ్లుగా వీడని మోనిక మర్డర్‌ మిస్టరీ

ఆరేండ్లుగా వీడని మోనిక మర్డర్‌ మిస్టరీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో ఆరేండ్ల కిందట జరిగిన ఇండో-ఫిజియన్‌ సంతతికి చెందిన నర్సు మోనికా చెట్టి (39) మర్డర్‌ మిస్టరీ ఇంకా వీడలేదు. దీంతో ఈ కేసు పరిష్కారం కోసం సమాచారం ఇచ్చిన వారికి సుమారు రూ.2.7 కోట్ల రివార్డు ఇస్తామని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఈ కేసు మిస్టరీ వీడవచ్చని ఆ రాష్ట్ర మంత్రి డేవిడ్‌ ఇలియల్‌ తెలిపారు. 2014 జనవరిలో సిడ్నీ సమీపంలోని వెస్ట్‌ హోక్సన్‌  ప్రాంతంలో మోనిక అచేతనంగా కనిపించారు. ఆమెపై యాసిడ్‌ దాడి జరుగడంతో పది రోజులుగా అక్కడే  పడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖం, శరీరంపై యాసిడ్‌ గాయాలైన మోనికను దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ నెల రోజుల తర్వాత చనిపోయారు.